అలవైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన 20 వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దానితో పాటు ఈ మూవీ కి పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అదే కావడం తో ఆ పేరే సినిమాకు పెట్టడం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ గడ్డం తో మాస్ గా కనిపించాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుంది.