మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన సినిమా జులాయి. రాధా కృష్ణ, దానయ్యలు నిర్మాతలుగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా నటించింది. సంగీతం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా!! ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటితో సరిగ్గా ఎనిమిదేళ్లు అవుతుంది. ఇదే విషయమై స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ట్వీట్ చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు రాధా కృష్ణ దానయ్యలకు ధన్యవాదాలు తెలిపారు.
8 years of Julai . What a memorable hit . I would like to Thank #trivikram garu , my dear friend @thisisdsp , and my producers Radha Krishna & Danaayya garu and the entire cast n crew for a wonderful experience. #julai pic.twitter.com/HEMlGB6Kwi
— Allu Arjun (@alluarjun) August 9, 2020