అల్లుఅర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పరుగు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు. అక్కడ బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా హీరో పంతి పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు హిందీలో షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చూస్తున్నారు. దానికి టైగర్ ఆసక్తిగా ఉండటంతో హీరో పంథి సీక్వెల్ కథను షబ్బీర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బన్ని గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ బన్నీని అప్రోచ్ అయ్యినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సీక్వెల్ లో నటించడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది మాత్రం తెలియదు. తెలుగులో కూడా పరుగు సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నిర్మాత దిల్ రాజు ప్రయతినిస్తున్నట్లు సమాచారం.