స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న సినిమా అల వైకుంఠపురంలో. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందురానుంది. అయితే అల్లుఅర్జున్ నెక్స్ట్ సినిమాకి అప్పుడే ప్లాన్స్ చేసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ లో ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తూ కనిపించనున్నాడట. దీనికోసం అల్లుఅర్జున్ పూర్తిగా లుక్ చేంజ్ చేసుకోవాలని సుకుమార్ చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ కు ఏది మూడవ సినిమా. మొదట ఆర్య, ఆర్య 2 సినిమాల్లో క్లాస్ గా చూపించిన సుకుమార్ ఈ సారి డిఫరెంట్ గా మాస్ యాంగిల్లో అల్లుఅర్జున్ ని చూపించనున్నాడు.