స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తోడేలు ఫైట్ నేర్చుకుంటున్నాడట. యాక్షన్ సీన్ కోసం అడవిలో తోడేలులా పరిగెత్తాలట అలాగే తోడేలులా దాడి కూడా చేయాలట. ఈ నేపథ్యంలోనే బన్నీ తోడేలులా ప్రాక్టీస్ చేస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.