స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త మరింత అంచనాలను పెంచుతుంది.
ఈ సినిమాలో ఓ సీన్ ను 500 మందితో ఓ కొండపైన తెరకెక్కించనున్నాడని దేవిశ్రీప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 500 మంది తో సీన్ అంటే బన్నీ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే అది ఫైట్ సీనా లేక ఇంకేమన్నా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.