అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడో సారి వస్తున్న హీరో అల్లు అర్జున్. శుక్రవారం సెన్సార్ కూడా పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్దం చేసింది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న బన్నీకి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం కావటంతో సినిమా ప్రమోషన్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు.
అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6న ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ… చీఫ్ గెస్ట్‌ను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు అల్లు అర్జున్. ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి వచ్చేవారు. ఈసారి కూడా ఆయనే వస్తారని మెగా అభిమానులు ఎదురు చూసినా… సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జనవరి 5న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్‌కు అటెండ్ అవుతున్నారు చిరంజీవి. ఈ సినిమా సంక్రాంతికే విడులవుతుండగా… అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు పోటీగా వస్తుండటంతో అల్లు అర్జున్ డైలామాలో పడిపోయారు. చిరు రాకపోయినా త్రివిక్రమ్ పవన్‌ను తీసుకొస్తారని ప్రచారం జరిగినా… మళ్లీ అది చిరు వర్సెస్ పవన్‌గా ప్రొజెక్ట్ అవుతుందన్న అనుమానంతో వెనుకడుగు వేశారు.
దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా ఎవరిని తీసుకొస్తారు అని మెగా అభిమానులు ఆసక్తి చూస్తున్నా… ఎవరినీ తీసుకరాకుండానే ఈవెంట్ చేయాలని డిసైడ్ అయ్యారట అల్లు వారు. కేవలం చిత్ర యూనిట్ పాల్గొనటంతో పాటు త్రివిక్రమ్ మాటలు ఖచ్చితంగా అభిమానులకు బూస్ట్‌నిచ్చే విధంగానే ఉంటాయని, పైగా అల్లు అర్జున్ కనీసం రెండు పాటలకు స్టేజ్‌పై స్టెప్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా అయితే మెగా అభిమానులు మరింత జోష్‌తో వెళ్తారని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.