రెండేండ్ల క్రితం హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో యాక్ట్ చేయాలంటూ వచ్చిన భారీ ఆఫర్ ను ఆమె వదులుకున్నారు. అసత్య ప్రచారాలను, కృత్రిమ అందాలను తాను ఎప్పుడూ ప్రోత్సహించనని ఆమె వెల్లడించారు.
ఈ మేరకు రూ. 2 కోట్ల విలువైన యాడ్ ను ఆమె రిజెక్ట్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి బాటలోనే టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ నడుస్తున్నారు. తాజాగా ఆయన తనకు పొగాకు కంపెనీ ఇచ్చిన భారీ ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. ఆ యాడ్ లో నటించేందుకు ససేమేరా అని కంపెనీకి నో చెప్పారు.
సదరు కంపెనీ స్టైలిష్ స్టార్ ముందు ఈ ఆఫర్ పెట్టగానే వెంటనే ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా ఆఫర్ ను పక్కకు పెట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనికి మొదటి కారణం ఆయన వ్యక్తిగతంగా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకపోవడమని వర్గాలు చెప్పాయి.
ఇక తాను యాడ్ లో నటిస్తే దాన్ని తన ప్రేక్షకులు చూస్తారని, దీంతో వాటిని వినియోగించడం మొదలు పెడతారని, ఆ తర్వాత అది అభిమానులకు ఓ వ్యసనంగా మారుతుందని అల్లు అర్జున్ చెప్పారని ఆయన సన్నిహితులు చెప్పారు. అది తనకు ఇష్టం లేదని అందుకే తాను ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నట్టు బన్నీ తమకు వివరించారని వారు తెలిపారు. దీంతో బన్నీ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తు్న్నారు.