వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త మూవీ ‘అల…వైకుంఠపురములో..` మూవీ పోస్టర్ రిలీజయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్నిగీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలకై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను బన్నీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఖరీదైన కారు పక్కన, సూట్ వేసుకున్న బన్నీ ఓ స్టూల్‌పై కూర్చుని ఉంటే కారు డ్రైవర్ బీడీ అంటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఫాన్స్‌లో భారీ క్రేజ్ వుంది.
1st Poster of AVPL . #AlaVaikunthapuramuloPoster pic.twitter.com/xSdKvaYHAn
— Allu Arjun (@alluarjun) September 1, 2019