తగ్గేదేలే…అనే డైలాగ్ తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది పుష్ప సినిమా. ఈ చిత్రం రిలీజైన ప్రతి చోటా భారీ వసూళ్లను రాబట్టింది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో రష్యలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి లాభాలు చూసింది. అందులో అల్లు అర్జున్ వేషం, భాష, యాస ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ లో అయితే ఏకంగా ఈ చిత్రం 100 కోట్లు మేర వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ద రూల్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు చోట్ల శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో పాత క్యారెక్టర్ల తో పాటు కొత్త పాత్రలు కూడా యాడ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సాయి పల్లవి కూడా ఓ కీ రోల్ చేయనున్నట్లు సమాచారం.
అందుకు తన కాల్షీట్ లోని పది రోజులను కూడా కేటాయించిందంట. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ను లాంచ్ చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందట.తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనాలను సృష్టిస్తోంది. ఏంటంటే ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కోట్లు కురిపిస్తోందట.
థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను కూడా వసూలు చేసిందట. అయితే ఈ విషయం పై ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.