స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ను ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది.
మొదట ఈ పాత్రలో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ తర్వాత విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. అయితే ఫవాద్ ఫాజిల్ ను ఈ సినిమా లో తీసుకోవడానికి కారణం లేకపోలేదట. మామూలుగా అల్లు అర్జున్ కు మలయాళంలో కాస్త ఫాలోయింగ్ ఎక్కువ. ఇక అల్లు అర్జున్ సినిమాలకు కలెక్షన్లు కూడా అక్కడ బాగానే వస్తాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మరింత మార్కెట్ ను పెంచుకునేందుకు అల్లు అర్జున్ ఫవాద్ ఫాజిల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫవాద్ ఫాజిల్ కూడా అక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంది. మలయాళీ లో జెండా పాతటానికే అల్లుఅర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.