హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్నారు. వీళ్లిద్దర్నీ స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నాడు. అదేంటి.. అసలు ఎలాంటి అప్ డేట్ లేకుండా ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందని ఆలోచిస్తున్నారా?
ఈ కాంబినేషన్ సెట్ అయిన మాట వాస్తవమే. సెట్స్ పైకి వచ్చిన మాట కూడా వాస్తవమే. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు. అవును.. ఓ యాడ్ షూట్ కోసం ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.
అల్లు అర్జున్, శ్రీలీలపై ఓ యాడ్ తీస్తున్నాడు త్రివిక్రమ్, ఈ యాడ్ షూట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. దీనికి సంబంధించి పిక్ కూడా సోషల్ మీడియాలో రిలీజైంది. దీంతో సరికొత్త చర్చ మొదలైంది.
బన్నీ-శ్రీలీల జోడీ చాలా బాగుందని, వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. శ్రీలీల ఇప్పటికే టాప్ లీగ్ వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. ఆల్రెడీ మహేష్ మూవీలో ఆఫర్ కొట్టేసింది. కాబట్టి బన్నీ ఓకే అంటే, శ్రీలీలకు డబుల్ ఓకే.