ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ చిత్రంగా ప్రేక్షకుల మదిని దోచుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ 150కోట్లు పైగా షేర్ సాధించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అల మూవీ ఇచ్చిన సక్సెస్ తో క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపించనున్నారని టాక్. స్టైలిష్ స్టార్ సరసన..టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో టాప్ గేర్ లో దూసుకెళ్తోన్న రష్మీక మందన్న నటించనుంది.
సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ ఓ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నాడట.లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీలో అల్లు అర్జున్ 7 శాతం వాటాను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఓ రాజకీయ నాయకుడి సలహా మేరకు ఆయన ఈ సంస్థలో వాటా కొనుగోలు చేశాడని ప్రచారం జరుగుతోంది. ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరయ్యే సినీ తారలకు విలువైన కార్లను ఈ సంస్థ అద్దెకు ఇవ్వనుందట.