అల వైకుంఠపురములో సినిమా సూపర్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు అల్లు అర్జున్. కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌తో ఎంజాయ్ చేస్తున్న బన్నీ తన తరువాత సినిమా డైరెక్టర్ సుకుమార్‌తో చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మీక మందన్న హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు.
కేరళలో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి సెకండ్ షెడ్యూల్ షూట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే… అనుకోకుండా సెకండ్ షెడ్యూల్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌పై కొన్ని షాట్స్ తీయాల్సి ఉండటంతో… ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌కు రీ షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ అందుబాటులో లేని కారణంగానే సినిమా షూట్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
గందపు చెక్క మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా బన్నీ కొత్త సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయలేదు. అల వైకుంఠపురుమలాగే… సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని బన్నీ ఫాన్స్ దీమాగా ఉన్నారు.