స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ పుట్టినరోజు నేడు. అయితే తన కూతురు అర్హ కూ సర్ప్రైజ్ ఇచ్చానని తెలిపారు అల్లు అర్జున్. ఆమెను ఓ గుర్రంపై కూర్చోబెట్టి ఆమె కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా అల్లుఅర్జున్ పోస్ట్ చేశారు. అర్హ నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకొని 5 ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇక తన కూతురికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు.
సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఏడాది ఆరంభం లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠ పురములో చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు.