అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ పంపిన స్పెషల్ గిఫ్ట్ కు ఫిదా అయ్యాడు బన్నీ. ఈమేరకు అల్లు అర్జున్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విషయమేంటంటే… విజయ్ దేవరకొండ రౌడీ అనే బ్రాండ్ తో బట్టల వ్యాపారం ప్రారంభించాడు. ఆ రౌడీ బ్రాండ్ కి చెందిన స్పెషల్ క్లాత్స్ తో పాటు ఓ లెటర్ ను కూడా అల్లు అర్జున్ కు బహుమతిగా పంపాడు.
బన్నీ అన్న.. ఈ బట్టలు స్పెషల్‌గా నేను డిజైన్ చేశానని పేర్కోన్నాడు. ఆ బహుమతిని అందుకున్న బన్నీ… థాంక్స్ మై డియర్ బ్రదర్.. రేపు ఆల వైకుంఠపురములో విజయోత్సవ వేడుకల్లో ఈ బట్టలే ధరిస్తానని ట్వీట్ చేశాడు. ఆదివారం వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ నటించిన ఆల వైకుంఠపురములో సినిమా విడుదల అవ్వనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది.
THANK YOU VERY
MUCH MY DEAR BROTHER VIJAY @TheDeverakonda . VERY SWEET GESTURE. AS PROMISED U SENT ME CLOTHES . YOU WILL BE SEEING ME WITH IT DURING #AVPL CELEBRATIONS #ROWDY #Manofwords pic.twitter.com/lY7BWGDzuE— Allu Arjun (@alluarjun) January 11, 2020
Advertisements