‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఈ ఏడాది అదిరిపోయే హిట్ కొట్టేశాడు అల్లు అర్జున్. తన కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీగా అల సినిమా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి సందర్బంగా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను అల వైకుంఠపురంలో సినిమా తుడిచేసింది. ఇప్పటికి ఇంకా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందంటే.. అల సినిమా ఎంతగా ఆడియన్స్ కు కనెక్ట్ అయిందో చెప్పవచ్చు. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా…మరికొద్ది రోజులు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సినిమాకుగాను బన్నీ రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాగా సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు కావడంతో… బన్నీ పారితోషకం కూడా తన తండ్రి అకౌంట్లోకే వెళ్తుందని చాలామంది అనుకున్నారు.
బన్నీ రెమ్యునరేషన్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని స్పష్టం చేశాడు. ఈ సినిమాకుగాను తనకు రావాల్సిన పారితోషకం వచ్చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే రెమ్యునరేషన్ విషయమై తన తండ్రితో నేరుగా మాట్లాడాడబోనని.. ఈ విషయమై మాట్లాడేందుకు ఓ మధ్యవర్తి ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు. తన ఫ్రెండ్, ప్రొడ్యూసర్ బన్నీ వాసు తన పారితోషకం గురుంచి మాట్లాడతాడని చెప్పారు స్టైలిష్ స్టార్.