అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. ఓకే.. మంచి ముహూర్తం చూసుకుని భూమి పూజ కూడా చేసుకున్నాడు. అదీ ఓకే. మరి ఇంత పెద్ద శుభకార్యానికి బంధు మిత్రులు, భారీ హడావుడీ వుండాలి కదా! ఓకే.. సింపుల్‌గానే చేద్దామని అనుకున్నారనుకుందాం. మరైతే, అల్లు అర్జున్ అమ్మానాన్నలైనా వుండాలి కదా..? ఏరి..?
స్లయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. నూతన నివాసానికి శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలసి ఈ కార్యక్రమమాన్ని నిర్వహించారు. చక్కగా ఇటుకలను పేర్చి, అందులో కాంక్రీట్ పోస్తున్న ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తమ కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు పెట్టారు. ఈ టైటిల్ తెలియజేసే పోస్టర్ కూడా వైరైటీగా డిజైన్ చేశారు. ఫోటో షేర్ చేయగానే మెగాభిమానులు అభినందనల జల్లు కురిపించేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్‌తో కలిసే ఉంటున్నారు. సాధారణంగా భూమిపూజ లేదా శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలుగునాట భారీఎత్తున జరుపుతారు. ఆత్మీయుల మధ్య శంకుస్థాపన జరిపే సన్నివేశం, ఆ సందడి వేరే వుంటుంది. ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకునే ముందు ఆ ఆనంద క్షణాల్ని అందరితో కలిసి కచ్చితంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన ఇష్టాఇష్టాలకు సంబంధించినదే అయినప్పటికీ అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా, ఎలాంటి అట్టహాసం లేకుండా ఈ కార్యక్రమాన్ని కానిచ్చేయడం గురించి పెద్ద డిస్కషనే జరుగుతోంది.
ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తల్లిదండ్రులు అల్లు అరవింద్ ఎందుకు రాలేదనే సందేహాలు అభిమానుల్ని వదలడం లేదు. చూడాలి.. మరి అర్జున్ ఏం రిప్లయ్ ఇస్తాడో..