సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే సినిమా మొత్తానికి ఎస్ఎస్ థమన్ ఇచ్చిన సంగీతరం హై లెట్ గా నిలిచింది. ఇప్పటికే బుట్టబొమ్మ వీడియో సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ సాధించింది రికార్డు నెలకొల్పగా ఇప్పుడు ఆడియో ఆల్బమ్ మరో రికార్డు నెలకొల్పింది.
ఈ విషయాన్నీ సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. మొత్తం మ్యూజిక్ ఆల్బమ్ రెండు వందల మిలియన్ వ్యూస్ దక్కించుకుందని తమన్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
#200millionplays @JioSaavn #UnstoppableAVPL 🔊🔊🔊🔊 pic.twitter.com/TPTrcwFa3j
— thaman S (@MusicThaman) August 8, 2020