తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా పుష్ప సినిమా గురించే చర్చించుకుంటున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేయడంతో మరింత ఊపొచ్చింది. ఇప్పటికే ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమాలో ఐటం సాంగ్ గురించి అల్లు అర్జు్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సాంగ్ సమంత చేయడం గొప్ప విషయమని అన్నారు. హీరోయిన్స్ అంటే కొన్ని పరిమితులు పెట్టుకొని నటిస్తారని.. కానీ, ఐటం సాంగ్ గురించి తనని అడిగిన వెంటనే సమంత ఓకే చేశారని అల్లుఅర్జున్ అన్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి.. ఏం అడిగితే అది చేసేవారని తెలిపారు. అసలు నో అని చెప్పడం ఆమెకు తెలియదని సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు.