ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ వరద బాధితుల కోసం… సినీస్టార్స్ ముందుకు వచ్చారు. మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వంతు గా 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ తరువాత మహేష్ బాబు, చిరంజీవి కూడా ప్రకటించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన వంతు సహాయం ప్రకటించారు.
ఆంధ్రాలో వచ్చిన భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని, వాళ్లకు తన తరపున సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు.
My heart goes out to the people of #AndhraPradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards @AndhraPradeshCM Relief Fund to aid with the rehabilitation efforts.
— Allu Arjun (@alluarjun) December 2, 2021
Advertisements