పుష్ప సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం ఫిజికల్ గా మెంటల్ గా చాలా కష్టపడ్డాడు ఐకాన్ స్టార్. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత 16 రోజుల వెకేషన్ కోసం అబ్రాడ్ కి వెళ్ళాడు. అయితే వెకేషన్ పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత బన్నీ కి ఒక స్వీటెస్ట్ వెల్కమ్ దక్కిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
ఆ వెల్కమ్ కూడా తన కూతురు అల్లు అర్హ నుంచి దక్కిండట. తాను ఇంట్లోకి రాకముందే గడప దగ్గర పూలతో వెల్కమ్ నాన అంటూ అర్హ రాసి ఆ వెనుకే నిలుచుని కనిపించిందట. ఆ ఫోటో ని బన్నీ సోషల్ మీడియా షేర్ చేస్తూ తన ఆనందం వ్యక్తం చేశాడు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప పార్టు 2 త్వరలోనే స్టార్ట్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక పుష్ప పార్టు1లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మలయాళం స్టార్ నటుడు ఫాహద్ విలన్ గా నటించారు. సమంత స్పెషల్ సాంగ్ లో నటించారు.
Advertisements