సూర్య.. ఛలో వెస్ట్‌గోదావరి

అల్లుఅర్జున్- అను ఇమ్మాన్యుయేల్ జంటగా రానున్న ఫిల్మ్ ‘నాపేరు సూర్య’. మైనర్ వర్క్స్ తప్పితే షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది. షూటింగ్‌కి రేపోమాపో కొబ్బరికాయ కొట్టేయనుంది యూనిట్. ఈ క్రమంలో ఆడియో ఎప్పుడు? ఎక్కడ అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ఈనెల 22న ఆడియో ఫంక్షన్ నిర్ణయించాలని ప్లాన్ చేసింది.

తొలుత ఫంక్షన్ సిటీల్లో చేయాలని ఆలోచన చేసినప్పటికీ, చివరకు వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో మిటలరీ మాధవరం ప్రాంతంలో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన అమరవీరుల జ్ఞాపకార్థం స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి ఆ తర్వాత ఆడియో ఫంక్షన్ చేయాలన్నది థాట్.

ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకానున్నట్లు బన్నీ అండ్ కో చెబుతున్నమాట. ఆ మధ్య అల్లుఅర్జున్ ‘సరైనోడు’ ఫంక్షన్‌కి చిరు రావడంతో ఆ మూవీ హిట్టయ్యిందన్న నమ్మకం అభిమానుల్లో బలంగా వుంది. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో చిరంజీవి అటెండవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.