పుష్ప ది రైజ్ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు, పరిశ్రమలోని ఇతర ప్రముఖులు అల్లుఅర్జున్ కు విషెస్ చెబుతున్నారు. కాగా అల్లుఅర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా విషెష్ తెలిపారు. పెన్సిల్ తో ఓ బొమ్మను వేసి పుష్ప విడుదల తేదీని రాస్తూ… అల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అంటూ రాసుకొచ్చాడు.
ఈ స్కెచ్‌ని బన్నీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా కృతజ్ఞతలు… ఐ లవ్ యూ మై అయాన్. నువ్వు ఈ కార్డ్‌తో నా ఉదయాన్ని మరింత ఉత్సాహపరిచావు అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ డ్రాయింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్, సునీల్ మరియు అనసూయ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషలలో రిలీజ్ అయింది.