భీమ్లా నాయక్ గని రెండు చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అయితే దీనితో చాలా మంది చిరు అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు అవుతున్నాయని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను కలవడానికి మెగాస్టార్ చిరంజీవి చార్టర్డ్ ఫ్లైట్ లో అమరావతికి బయలుదేరినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి వచ్చారట అల్లు అరవింద్.
అయితే ఈ విషయం బయటకు రాలేదు. కానీ మెగాస్టార్ అతని బావమరిది అల్లుఅరవింద్ టచ్‌లోనే ఉన్నారట. అలాగే, సినిమాల విడుదల తేదీలను క్రమబద్ధీకరించడంలో దిల్ రాజుతో పాటు అరవింద్ కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
నిజానికి మొదటి నుంచి చిరంజీవి, అరవింద్‌ల ఐక్యత వల్లనే వారు వారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి డజను మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. వీరంతా కూడా సమయం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే అని చెప్తూనే వస్తున్నారు.
ఏదేమైనా అల్లు అరవింద్, చిరంజీవిలు మాత్రం ప్రస్తుతానికి టచ్ లోనే ఉన్నారట. సోషల్ మీడియాలో ఆ రెండు ఫ్యామిలీల మధ్య పొత్తు చెడింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదట.