ఒక్క గుడికి విరాళంగా 1800కేజీల బంగారం… ఆశ్చర్యంగా ఉన్న నిజం. పైగా మనదేశంలోనే. అవును… జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి గత 20 ఏళ్లలో 1800 కేజీల బంగారం విరాళంగా వచ్చినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది.
1800కేజీల బంగారంతో పాటు 4,700 కిలోల వెండి, 2000 కోట్ల నగదు ఆలయానికి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. సామాజిక కార్యకర్త హేమంత్ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
దేవాలయం వద్ద ఉన్న సొమ్ముతో… భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయటంతో పాటు పాఠశాలల మౌళిక వసతుల కోసం ఖర్చు చేయాలని హేమంత్ గునియా కోరారు.