కరోనా కారణంగా మూతబడిన బడులు 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పునః ప్రారంభమైనప్పటికీ.. పిల్లలని పంపేందుకు తెలంగాణలో తల్లిదండ్రులు ఇంకా తటపటాయిస్తూనే ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం దాదాపు 70 శాతం మంది పిల్లలను తిరిగి పాఠశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నారని ఒక సర్వే సూచించింది. లీడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇంకా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
మహమ్మారి కారణంగా తమ పిల్లలు అభ్యాసాన్ని కోల్పోతున్నారని 59 శాతం మంది తల్లిదండ్రులు సర్వేలో అభిప్రాయపడ్డారు. అలాగే మొత్తం 69 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తేనే.. నిజమైన పాఠశాల అనుభవం సాధ్యమవుతుందని తల్లిదండ్రులు చెప్పారు. మొత్తం 10,500ని సర్వేలో విచారించారు.1-10 తరగతులు చదివే పిల్లలున్న తల్లిదండ్రులు ఇందులో పాల్గొన్నారు.
Advertisements
ఇక మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది తల్లిదండ్రులు.. పాఠశాల సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలన్నదాన్ని తమ ప్రాధాన్యతగా చెప్పారు. 55 శాతం మంది తల్లిదండ్రులు సామాజిక దూరం పాటించాలని కోరారు. ఇక 54 శాతం మంది వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక 52 శాతం మంది సామాజిక దూరం ముఖ్యమని చెప్పారు .