‘గుడి గంటలు” ఈ పేరు వింటేనే గుడికి, గంటలకు విడదీయలేని సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గంటలు లేని గుడిని మనం అసలు ఊహించలేము. అంతలా ఆ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
అయితే ఇటీవల గంటలకు డిమాండ్ పెరుగుతోంది. గంటలకు పెరుగుతున్న ఈ డిమాండ్ ను తీర్చడంలో ఉత్తరప్రదేశ్ లోని ఇటావా నగరం ముందుంది. బెల్స్ తయారీలో ఇక్కడి హస్త కళాకారులు పరిపూర్ణత సాధించారు. కానీ వారి నైపుణ్యానికి పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఇటీవల వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ పథకం వచ్చాక ఈ పరిస్థిని మార్చింది. దేశంలో గంటలకు అతిపెద్ద సరఫరాదారుగా ఇటావా ప్రాంతం తన గుర్తింపును నిలుపుకోవడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోంది.
ఇటావా గంటలకు డిమాండ్
ఇటావాలో తయారైన గంటలకు దేశ వ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. 2019లో రామ మందిరంపై తుది తీర్పు రాగానే ఆలయం కోసం రెండు టన్నుల ఇత్తడి గంట కోసం జలేసర్ లోని తయారీదారులకు నిర్మోహీ ఆఖారా ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడి గంటలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. కేదార్‌నాథ్ నుండి మహాకాళేశ్వరం వరకు ఏ ఆలయానికైనా ఇటావా జిల్లాలోని ఈ మెటల్‌వేర్ క్లస్టర్‌లో గంటలు వెళ్లాల్సిందే.
తయారీలో ప్రత్యేకత
ఇత్తడి ధ్వని, దాని ప్రతిధ్వనిని మెరుగుపరిచే అచ్చులను రూపొందించడానికి ఇటావాలోని నేలలు చాలా బాగా ఉపయోగపడుతాయి. ఆ అచ్చులోకి వెళ్లే బంకమట్టి పనితీరు లేదా ఆ ఇత్తడి శ్రావ్యతకు కారణమైన ఇటాహ చేతివృత్తుల వారి నైపుణ్యమనేది అబ్బురపరిచే విషం. ఇక్కడ కనిపించే చిన్న ‘ఘుంగ్రూస్'(నాట్యంలో ఉపయోగించే కాలి గజ్జెలు) నుండి భారీ ‘ఘంటిస్’ (ఆలయ గంటలు) వరకు దేశంలో మరెక్కడా కనిపించవు.
అతిపెద్ద ఇత్తడి పని క్లస్టర్
దేశంలో అతిపెద్ద బ్రాస్ వర్క్ క్లస్టర్ మొరాదాబాద్ జిల్లా చుట్టూ కేంద్రీకృతమై ఉంది. దీన్ని 19వ శాతబ్దంలో ఏర్పాటు చేశారు. 1961 జనాభా లెక్కల సమయంలో తయారు చేసిన హస్తకళల సర్వే మోనోగ్రాఫ్‌ల ప్రకారం, యూపీలో 5,000 మంది కార్మికులు ఉండగా, ఇటాహ జిల్లాలో సుమారు 200 మంది కార్మికులు ఉన్నారు. దేశ బ్రాస్ వేర్ ఎగుమతుల్లో 75 శాతానికి పైగా మొరాదాబాద్ నుంచే ఉంటాయి.
వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ పథకం
ఒకప్పుడు ఈ పరిశ్రమ జలేసర్ పట్టణంలోని హతౌరా అనే వీధి కేంద్రంగా ఉండేది. ప్రత్యేకంగా థాథెరాస్ అనే లోహపు పని చేసే కులానికి చెందిన చిన్న కుటుంబాల పరిధిలో ఈ పరిశ్రమ ఉండేది. కానీ ఈ జిల్లాలో ఈ ప్రత్యేక కళ అంతరించిపోయే దశలో ఉంది.
అయితే వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ పథకం అమలు చేయడంతో దీన్ని కొంత వరకు పునరుద్దరించారు. ప్రధానంగా బెల్ కాస్టింగ్‌లో 200 మందికి పైగా కొత్త హస్తకళాకారులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా శిక్షణలను అధికారులు ఇప్పించారు.
10,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఫ్యాక్టరీ యూనిట్‌లకు ఆర్థిక సహాయం అందించి, కళాకారుల శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో ఈ పరిశ్రమ ఇటీవల పునరుజ్జీవనం చెందింది.
మోడీ ప్రభుత్వ చర్యలు
ఈ పరిశ్రమ వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ కింద గణణీయమైన పురోగతిని సాధిస్తున్న సమయంలో కొవిడ్ సమయంలో లాక్ డౌన్ మూలంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో ఈ పథకం కింద బ్రాస్ వర్క్ పనివారికి సహాయం అందించేందుకు గాను ఇటాహతో పాటు మరో నాలుగు జిల్లాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. వీటిలో మేధేనీపూర్ (పశ్చిమబెంగాల్), తికాంఘర్ (మధ్యప్రదేశ్), తంజావూరు (తమిళనాడు), జనగామ(తెలంగాణ)ఉన్నాయి.
2014లో జండియాల గురు, పంజాబ్‌లోని థాథెరాస్‌లో సాంప్రదాయ ‘ఇత్తడి పాత్రల తయారీ’ని యూనెస్కో గుర్తించింది. ఇక ఇప్పుడు ఈ బెల్ క్యాస్టింగ్ కు జియో గ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, యూనెస్కె గుర్తింపులను తీసుకు వచ్చేలా చేయడం మోడీ సర్కార్ ముందున్న కర్తవ్యం.