ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. యూపీలోని సీతాపూర్ లో వివాదాస్పద వ్యాఖ్యల చేశారంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలను శుక్రవారం విననున్నట్టు సర్వోన్నత న్యాయ స్థానం వెల్లడించింది. జుబేర్ కు ప్రాణహాని ఉన్నట్టు ఆయన తరఫున న్యాయవాది కొలిన్ గొనసాల్వే కోర్టుకు తెలిపారు.
ఇటీవల హిందూ సన్యాసులను అవమానిస్తూ జుబేర్ ట్వీట్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఈ కేసులో జుబేర్‌ను ఢిల్లీ పోలీసలు గత వారం అరెస్టు చేశారు.
ఈ కేసులో జుబేర్ ను యూపీలోని సీతాపూర్ కోర్టులో సోమవారం పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం జుబేరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.