ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మరోసారి విశ్వ రూపందాల్చింది. పుట్టినిల్లు చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదువుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మార్చి నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56వేల కొత్త కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది.
అంతేకాకుండా హాంకాంగ్ లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయని వెల్లడించింది. కరోనాకు కళ్లెం వేసేందుకు డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకెళ్తామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు తెలిపారు. అందుకు తగిన చర్యలను తీసుకుంటున్నామని.. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు.
హాంకాంగ్‌లో గత నెల రోజుల్లో 200 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డట్టు అధికారులు తెలిపారు. ప్రతి రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇది ప్రపంచ దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు.
Advertisements
చైనాలో ఇటీవల మొదలైన వేవ్ కారణంగా ఒక్క హాంకాంగ్‌లోనే ఏకంగా 10 లక్షలకు పైగా కేసులు నమోదుకావడం అధికారుల్లో గుబులు రేపింది. అయితే.. కరోనాను నియంత్రించేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.