రెండ్రోజుల కాశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైష్ణోదేవిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ… నేను కూడా కాశ్మీర్ పండిట్ నే. నాకు సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. నా కుటుంబం అంతా కాశ్మీర్ పండిట్ లే అని వ్యాఖ్యానించారు.
ఈ పర్యటనలో తనను కొందరు కాశ్మీర్ పండిట్ లు కలిసి… కాంగ్రెస్ పాలనలో తమకు ఎంతో లబ్ధి చేకూరిందని, బీజేపీ మాత్రం కాశ్మీర్ పండిట్ లను పట్టించుకోవటం లేదని చెప్పినట్లు తెలిపారు. రాహుల్ తర్వాత లఢఖ్ లో పర్యటించనున్నారు. జమ్మూ-కాశ్మీర్ అంటే నా గుండెల్లో ఎంతో ప్రేమతో పాటు బాధ కూడా ఉందన్నారు. అన్నాదమ్ములా ఉన్న జమ్మూ కాశ్మీర్ బంధాన్ని విడదీశారని రాహుల్ ఆరోపించారు. ఈ ప్రాంతానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు.