తెలుగుతెరపై కొంతకాలం సందడి చేసి బాగానే మెప్పించింది అమలాపాల్..మెగా హీరోలతో కలిసి ఈ అమ్మడు నటించిన…ఆ క్రేజ్ తో వరుస అవకాశాలు వస్తాయని భావించిన నిరాశే దక్కింది. రామ్ చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో మెరిసింది కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదు దీంతో అమలాపాల్ తమిళ,మలయాళ ఇండస్ట్రీల వైపు మొగ్గు చూపి అటువైవు వెళ్ళింది. అక్కడ సినిమాలో బాగానే బిజీ అయిపోయింది అమలాపాల్.
ఇదిలా వుండగా.. అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమలాపాల్ తన ప్రియుడికి లిప్ లాక్ కిస్ పెడతోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ ప్రేమించిన ముంబైకి చెందిన సింగర్ భవీందర్ సింగ్ ను వివాహం చేసుకుందని ప్రచారం జరిగింది.
అయితే అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ జరుగుతోన్న ప్రచారం కాస్తా ఆమె చెవిలో పడింది.దీంతో ఈ విషయమై స్పందిస్తూ అదంతా ఉత్తదే అంటూ స్పష్టం చేసింది అమలాపాల్.అది ఫోటో షూట్ కోసం చేశామని క్లారిటీ ఇచ్చింది.
అమలాపాల్ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపి.. 2014లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. దీంతో ఆమె ప్రేమాయణం నడుపుతోన్న సింగర్ తో రెండో పెళ్లి చేసుకుందని వార్తలు రాగా..వాటిని కొట్టిపారేసింది అమలాపాల్.