చిన్న చిన్న నటీ నటుల నుండి అగ్రశ్రేణి తారల వరకు ఇప్పుడంతా డిజిటల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో హీరోయిన్ అమలాపాల్ కూడా చేరిపోయారు. తెలుగు, తమిళ్ సహా పలు భాషల్లో వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకొని నటిస్తుందన్న గుర్తింపు పొందింది.
గతంలో ఆమె చిత్రంలో నగ్నంగా నటించిన అమలాపాల్… ఇప్పుడు హిందీలో రాబోయే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించనుంది. మహేష్ భట్, జియో స్టూడియోస్ కాంభినేషనల్ లో రాబోతున్న ఈ సిరీస్ తమిళంలో వచ్చిన ఓ పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. 1970 బ్యాక్ డ్రాప్ కథాంశంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, అమలాపాల్ నటన ఈ సిరీస్ కు కీలకమవుతుందని తెలుస్తోంది.