సినిమా రిలేషన్షిప్స్ ఎంత తొందరగా ఫామ్ అవుతాయో అంతే తొందరగా బ్రేక్ అప్ అవుతాయన్నిది చాలా మంది జంటల్లో రుజువైన వాస్తవం. అది పెళ్ళికావొచ్చు, లివింగ్ రిలేషన్ కావొచ్చు, ప్రేమకావొచ్చు,ఫ్రెండ్షిప్ కావొచ్చు.అయితే కొన్ని జంటల్ని మాత్రం ఈ స్టేట్ మెంట్ కింద కొట్టిపడేయ్యలేం.
ఉదాహరణకు నాగార్జున అమల జంట సినీరంగంలోనే తారసపడి, ఒకర్నొకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకుని చాలా యేళ్ళుగా కలిసి ఉంటున్నారు. కానీ అక్కినేని నాగచైతన్య సమంత విషయంలో ఇది వర్కవుట్ కాలేదు.
ఏ మాయ చేశావే అనే చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సమంత నాగ చైతన్య నాలుగేళ్ల వివాహ బంధం అనంతరం ఒకర్నొకరు దూరమయ్యారు. 2017 అక్టోబర్ 7 న వీరిద్దరి వివాహం జరిగింది.
ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లోనుంచి అక్కినేని అనే పేరు తీసేసింది. దీంతో వారిద్దరి మధ్యా ఏదో జరిగిందన్న వార్తలు గుప్పుమన్నాయి. కాని కొద్ది రోజులకి అంటే 2021 అక్టోబర్ 2న తమ విడాకులు ప్రకటించారు.
సమంత చేస్తున్న కొన్ని షూటింగ్స్ ను మానేయాలని..తన అత్తగారైన అమల లాగే ఇంట్లో ఉండాలంటూ కుటుంబ సభ్యులు సూచించారని, దానికి సుముఖంగా లేకపోవడం వలన సమంత విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పటి వరకు ఇద్దరి విడాకుల గురించి జరుగుతున్న ప్రచారం పైన ఇద్దరి నుంచి స్పష్టత రాలేదు. అయితే తాజాగా కొత్త వ్‌ావహారం వెలుగులోకి వచ్చింది. సమంత ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత- నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట.
Also Read: రానా నాయుడు ట్రైలర్ అదిరింది
అప్పుడు .. నాగచైతన్య, సమంత మీద అప్పటికి ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ హీరోయిన్ మరెవ్వరో కాదు శోభిత ధూళిపాళ. ఈ విషయాన్ని సమంత సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట.
దీంతో చెప్పుడు మాటలు విన్న సమంత నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో వారే తెలిపాలి. కాకపోతే ఇప్పటికీ వారిద్దరూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు.
Also Read: అరెరే శంకర్ సార్ ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు?