అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 41వ రోజుకు చేరింది. అమరావతి రాజధానిగా కొనసాగితేనే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని రైతులు అన్నారు.
తిరుపతిలో ఏర్పాటు కానున్న బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని రైతు సంఘాల నేతలు తెలిపారు. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనికులకు రైతులు నివాళులు అర్పించారు. అటు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా రైతుల్ని కలిసి అమరావతికి మద్దతు తెలిపారు.