థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇదే నేర్పిందా..? - Tolivelugu

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇదే నేర్పిందా..?

పెయిడ్ ఆర్టిస్టులే రాజధానిలో ఆందోళన చేస్తున్నారన్న సినీనటుడు పృద్విరాజ్ వ్యాఖ్యలపై ఆ ప్రాంత రైతులు భగ్గుమన్నారు. రైతులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన పృద్విరాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మందడంలో పృద్విరాజ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించి అనంతరం దహనం చేశారు. స్థానిక రైతులే ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకోవాలని తమ ఆధార్ కార్డులను చూపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పృద్వీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ రైతులు హెచ్చరించారు. తీరును మార్చుకోకపోతే సరైన రీతిలో జవాబిస్తామని పేర్కొన్నారు.


Share on facebook
Share on twitter
Share on whatsapp