రాజధాని కోసం తమ భూములు త్యాగం చేస్తే… ఇప్పుడు రాజధానిని తమకు లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తూ అమరావతి రైతుల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. రాజధాని కమిటీ కూడా సీఎం జగన్ చెప్పినట్లే రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపిస్తూ… రోడ్ల మీదకు వస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బెంచ్‌లు, స్తంబాలు పెట్టి నిరసన తెలుపుతన్నారు.
తుళ్లూరులో మహాధర్నా ఉండగా… 29 గ్రామాల రైతులు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాజధానిపై కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఈ నెల 27న జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుంది.