తమకు అన్యాయం జరుగుతున్నా… రాజధాని మార్పుకు అనుకూల వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహించిన పలువురు మహిళా రైతులు, నేతలు ఆగ్రహంతో మీడియా ఛానళ్ల ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. మూడు రాజధానులను సపోర్ట్ చేస్తున్నారంటూ… బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా మౌనదీక్ష వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అడ్డొచ్చిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేయటంతో.. వారిని అక్కడి నుండి పంపించి వేశారు. ఈ దాడిలో మీడియా వాహనాలు ద్వంసం అయ్యాయి.