రాజధానిపై బెంగతో మరో రైతు తనువు చాలించాడు. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. గోపాలరావు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు . రాజధానిని తరలించనున్నారని మనస్థాపానికి గురై గోపాలరావు గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. జగన్ అసంబద్ధ నిర్ణయంతో రైతులు మృతి చెందుతున్నారని విమర్శించారు.