ఏపీలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు సకల జనుల సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమరావతి మండలంలో రైతులు పోలీసు వాహనాలు, ప్రభుత్వ వాహనాలను తుడిచి నిరసన తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులకు రైతులు పూలు ఇచ్చి సకల జనుల సమ్మెకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Advertisements