ఏపీ రాజధాని అమరావతి రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్ లో మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మహిళా రైతులు ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి గురైన మహిళా రైతులు కిషన్ రెడ్డి కాళ్లమీద పడి తమ డిమాండ్ ను పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు. దీనిపై మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన వల్ల అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని…రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూర్చొని రాజధాని సమస్యను పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » కిషన్ రెడ్డి కాళ్లపై పడిన మహిళా రైతులు..