ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి సీడ్ యాక్సిస్ రహదారిపై బైఠాయించారు. అటు మందడం, ఇటు సీడ్ యాక్సిస్ రెండు రహదారులను దిగ్బంధించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని విషయంలో జగన్ వెనక్కి తగ్గే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా రైతులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నది.