పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. వందలాది మంది విద్యార్ధులు ధర్నాలో పాల్గొన్నాయి. తమ భవిష్యత్ ను నాశనం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ధర్నా చేసేందుకు తుళ్లూరులో టెంట్ వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగి కొద్ద సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత స్థానికులు మళ్లీ టెంటు వేసుకొని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు రహదారిపై బైఠాయించారు.
మరోవైపు విజయవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏపీ రాజధాని, హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి సిటీ సివిల్ కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మందడంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. మందడంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది ట్రాఫిక్ స్తంభించడంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.