ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం విష ప్రచారం మానుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని జగన్ విరమించుకోవాలంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము చేపట్టిన ఆందోళనలను విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మందడం, తుళ్లూరు, ఎర్రబాలెం, నీరుకొండలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని విషయంలో జగన్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు.