ఏపీ సీఎం జగన్ కు రాజధాని నిరసన సెగ తగిలింది. సెక్రటేరియట్ కు జగన్ వెళ్తుండగా పలువురు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మందడంలో సీఎంను అడ్డుకునేందుకు మహిళలు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జై అమరావతి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జగన్ మూడు ప్రతిపాదనల విషయంలో పునరాలోచించాలని కోరారు. ఐదేండ్లు రాజధానిగా ఉన్న అమరావతిని ఇప్పుడు క్యాపిటల్ సిటీకి అణువువైన ప్రదేశం కాదని చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యమేంటని ప్రశ్నించారు.