బీజేపీ నేత విష్ణుకుమార్ రెడ్డిపై ఓ ఛానల్ టీవీ లైవ్ డిబెట్ లో జరిగిన చెప్పుదెబ్బల దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఉద్యమంలో పెయిడ్ ఆర్టిస్టులు, తెలుగుదేశం కండువా కప్పుకో అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించటంతో అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు ఆగ్రహంతో చెప్పుతో దాడి చేశారు.
తాము నెలల తరబడి ఉద్యమం చేస్తుంటే చులకనగా మాట్లాడితే ఎలా తట్టుకుంటాం… ఉద్యమం చేస్తూ రైతులు మరణిస్తుంటే పట్టించుకోవటం లేదన్నది వారి వాదన.
అయితే, ఇప్పుడు ఈ చెప్పు దెబ్బల వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. పువ్వులకు సరైన గుణపాఠం జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, టీడీపీపై ప్రతీకారాలుంటాయి… వెయిట్ అండ్ సీ అంటూ బీజేపీ సానుభూతిపరులు కౌంటర్ ఇస్తున్నారు. నేతల మాటలకు చెప్పుతో కొట్టినట్లు మాటలతోనే జవాబు చెప్పాలి కానీ ఇలా భౌతికంగా దాడి అనేది అంగీకారమైనది కాదన్నది విశ్లేషకులంటున్నారు.
కానీ ఆ చెప్పు దెబ్బల వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.