రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు ప్రయత్నించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాజ టోల్‌గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.
రాజధాని పరిధిలోని 29గ్రామాల్లో భారీగా పోలీసులను మొహరించి, 144సెక్షన్‌ను విధించారు.