SSMB28 త్రివిక్రమ్-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ముచ్చటైన మూడో చిత్రం. వీరి కలయికలో సినిమా అంటేనే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎగ్‌జైట్ అవుతున్నారు.
ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టిపరిస్థుతుల్లో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్రబృందం గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి గతకొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పేరని, ఈ పేరని పలు టైటిల్స్ నెట్టింట షికార్లు కూడా చేశాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టైటిల్ మాత్రం ఫిక్సయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్‌ను చిత్రబృందం లాక్ చేసినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ ఎప్పటిలాగే ‘అ’ సెంటిమెంట్ కలిసి వచ్చేలా టైటిల్‌ను పెట్టాడట. అయితే హీరో ఇమేజ్ దృష్ట్యా కాకుండా కథకు తగ్గట్టే ఈ టైటిల్‌ను త్రివిక్రమ్ ఫైనల్ చేశాడని టాక్.
ఈ సినిమా కథ గుంటూరు బ్యాక్‌డ్రాప్‌తో అమరావతికి చెరో వైపు ఉన్న ఊళ్లలో హీరోకు సంబంధం ఉన్న రెండు కుటుంబాల కథగా సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.
ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని హీరో ఎలా తొలిగించాడు అనే నేపథ్యంలో సినిమా ఉండనుందని పలువురు చెబుతున్నారు. ఇక ఎక్కువగా సినిమా మొత్తం పల్లెటూరిలోనే సాగనుందట.
కథ మరీ అంత కొత్తగా ఏమి లేకపోయినా త్రివిక్రమ్ తన మార్క్ టేకింగ్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఆ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారట.
ఇందులో నిజమెంతుందో కానీ మహేష్ అభిమానులు మాత్రం టైటిల్ అదిరిపోయిందని అంటున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.