దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఐఎండీ పలు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ముంబైలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది.దీంతో ముంబైలోనూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
థానేతో పాటు పాల్గర్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు చేసింది.ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లాల్లో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులను విద్యాశాఖ ప్రకటించింది.మరోవైపు ఉత్తరాఖండ్ లో దేలా నదిలో కారు కొట్టుకు పోయిన ఘటనలో 9 మంది మరణించారు.
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది.రాంబన్ జిల్లాలో జమ్ము కశ్మీర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ క్రమంలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.