జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు రాంబన్‌లోని మెహర్, కెఫెటేరియా ప్రాంతాల్లో మలుపుల వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పర్వత ప్రాంతాల్లో రాళ్లు పడుతుండటంతో అమర్ నాథ్ యాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. జమ్మూలోని భగవతినగర్ నుంచి 1,147 మంది భక్తులతో కూడిన బృందం ఉదయం బయలు దేరింది.
రోడ్డుమార్గాన్ని పునరుద్ధరించిన తర్వాత ప్రయాణికులను పహల్గామ్, బల్తాల్‌కు పంపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి కూల వాతావరణం వల్ల అమర్ నాథ్ యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.